అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె | VINNAPAALU VINAVALE IN TELUGU

అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె | VINNAPAALU VINAVALE IN TELUGU


రాగం: భూపాళం

విన్నపాలు వినవలె వింత వింతలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు ।
అల్లనల్ల నంతనింత నదిగోవారే ।
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు ।
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ॥

గరుడ కిన్నరయక్ష కామినులు గములై ।
విరహపు గీతముల వింతాలాపాల ।
పరిపరివిధముల బాడేరునిన్నదివో ।
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ॥

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు ।
పంకజభవాదులు నీ పాదాలు చేరి ।
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను ।
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ॥

Post a Comment

Support Us with a Small Donation