అన్నమయ్య కీర్తన ఈ సురలు ఈ మునులు | EE SURALU EE MUNULU IN TELUGU

అన్నమయ్య కీర్తన ఈ సురలు ఈ మునులు | EE SURALU EE MUNULU IN TELUGU


ఈ సురలీమును లీచరాచరములు ।
యిసకలమంతయు నిది యెవ్వరు ॥

ఎన్నిక నామము లిటు నీవై యుండగ ।
యిన్ని నామము లిటు నీవై యుండగ ।
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి ।
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ॥

వొక్కరూపై నీవు వుండుచుండగ మరి ।
తక్కిన యీరూపములు తామెవ్వరు ।
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ ।
మక్కువ నుండువారు మరి యెవ్వరు ॥

శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా ।
దైవంబులనువారు తామెవ్వరు ।
కావలసినచోట కలిగి నీవుండగ ।
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ॥

Post a Comment

Support Us with a Small Donation