అన్నమయ్య కీర్తన చేరి యశోదకు | CHERI YASODAKU IN TELUGU

అన్నమయ్య కీర్తన చేరి యశోదకు | CHERI YASODAKU IN TELUGU


చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ॥

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు ।
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు ॥

మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి ।
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ॥

ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు ।
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు ॥

Post a Comment

Support Us with a Small Donation