అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత | NARAAYANAACHYUTA IN TELUGU

అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత | NARAAYANAACHYUTA IN TELUGU


నారాయణాచ్యుతానంత గోవింద హరి ।
సారముగ నీకునే శరణంటిని ॥

చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ ।
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు ॥

పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు ।
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ॥

యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని ।
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే ॥

Post a Comment

Support Us with a Small Donation