అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద | MUDDUGAARE YASODA IN TELUGU

అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద | MUDDUGAARE YASODA IN TELUGU


రాగం: సాళంగనాట

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ।
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥

అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము ।
పంత మాడే కంసుని పాలి వజ్రము ।
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస ।
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము ।
మితి గోవర్ధనపు గోమేధికము ।
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము ।
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ॥

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ।
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము ।
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము ।
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ॥

Post a Comment

Support Us with a Small Donation