అన్నమయ్య కీర్తన ఏలే ఏలే మరదలా | ELE ELE MARADALAA IN TELUGU

అన్నమయ్య కీర్తన ఏలే ఏలే మరదలా | ELE ELE MARADALAA IN TELUGU


ఏలే యేలే మరదలా చాలుజాలు ।
చాలును చాలు నీతోడి సరసంబు బావ ॥

గాటపు గుబ్బలు గదలగ గులికేవు ।
మాటల దేటల మరదలా ।
చీటికి మాటికి జెనకేవే వట్టి ।
బూటకాలు మానిపోవే బావ ॥

అందిందె నన్ను నదలించి వేసేవు ।
మందమేలపు మరదలా ।
సందుకో దిరిగేవి సటకారివో బావ ।
పొందుగాదిక బోవే బావ ॥

చొక్కపు గిలిగింతల చూపుల నన్ను ।
మక్కువ సేసిన మరదలా ।
గక్కున నను వేంకటపతి కూడితి ।
దక్కించుకొంటివి తగులైతి బావ ॥ 

Post a Comment

Support Us with a Small Donation