అన్నమయ్య కీర్తన దాచుకో నీ పాదాలకు | DAACHUKO NEE PAADAALAKU IN TELUGU

అన్నమయ్య కీర్తన దాచుకో నీ పాదాలకు | DAACHUKO NEE PAADAALAKU IN TELUGU


రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి ।
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ॥

వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ ।
తక్కినవి భాండారాన దాచి వుండనీ ।
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము ।
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ॥

నానాలికపైనుండి నానాసంకీర్తనలు ।
పూని నాచే నిన్ను బొగడించితివి ।
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ ।
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా ॥

యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని ।
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను ।
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ ।
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ॥

Post a Comment

Support Us with a Small Donation