అన్నమయ్య కీర్తన చదువులోనే హరిన | CHADUVULONE HARINA IN TELUGU

అన్నమయ్య కీర్తన చదువులోనే హరిన | CHADUVULONE HARINA IN TELUGU


చదువులోనే హరిని జట్టిగొనవలెగాక ।
మదముగప్పినమీద మగుడ నది గలదా ॥

జడమతికి సహజమే సంసారయాతన యిది ।
కడు నిందులో బరము గడియించవలెగాక ।
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను ।
విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ॥

భవబంధునకు విధిపాపపుణ్యపులంకె ।
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక ।
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే ।
నివిరి నిన్నటివునికి నేటికి గలదా ॥

దేహధారికి గలదే తెగనియింద్రియబాధ ।
సాహసంబున భక్తి సాధించవలెగాక ।
యిహలను శ్రీవేంకటేశుదాసులవలన ।
వూహించి గతిగానక వొదిగితే గలదా ॥

Post a Comment

Support Us with a Small Donation